‘పండగచేస్కో’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం!

‘పండగచేస్కో’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం!

Published on Apr 3, 2015 6:40 PM IST

Pandaga-chesko
వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో’ విడుదలకు సిద్ధమౌతోంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ నెలాఖర్లో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. నిన్నే డబ్బింగ్ పూజ కూడా జరిగింది. తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పండగచేస్కో ద్వారా మనముందుకు వస్తున్నాడు రామ్.

‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ గత చిత్రాల్లానే మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్ ‘శివం’, ‘హరికథ’ సినిమాలు చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు