గుండెలకు హత్తుకునే హర్రర్ సినిమా.. ‘కాంచన 2’!

గుండెలకు హత్తుకునే హర్రర్ సినిమా.. ‘కాంచన 2’!

Published on Apr 5, 2015 7:17 PM IST

kanchana-2
నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘ముని’, దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కాంచన’ సినిమాలైతే సూపర్ హిట్లుగా నిలిచి లారెన్స్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి. హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ఈ సినిమాలు ఆ తర్వాత విడుదలైన హర్రర్ సినిమాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడీ కోవలోనే ముని సిరీస్‌లో మూడో భాగంగా ‘కాంచన-2’ రానుంది.

ఇప్పటికే పోస్టర్ల ద్వారా సినిమా పట్ల విపరీతమైన అంచనాలను పెంచేసిన లారెన్స్, సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన హర్రర్ సినిమాగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరినీ సినిమా ఆకట్టుకుంటుందనీ, గుండెలకు హత్తుకునే ఎమోషన్ ఈ సినిమాలో ఉందని లారెన్స్ తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల్లోనే విడుదలకు సిద్ధమౌతోంది ‘కాంచన 2′. తాప్సీ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెల్లంకొండ్ సురేష్ ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు