మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’లో భాగం అయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో శ్రుతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి రాకతో గ్లామర్ డోస్ మరింత పెరగనుంది.
అయితే, ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రుతి హాసన్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క పాట కోసం ఆమె దాదాపు రూ.2.5 నుండి రూ.3.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక స్పెషల్ సాంగ్‌కి ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 2026, జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రెహమాన్ ట్యూన్‌కి శ్రుతి హాసన్ డాన్స్ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


