ఆ ఒక్క సినిమా చేసి ఉండాల్సింది : ఫరియా అబ్దుల్లా..!

ఆ ఒక్క సినిమా చేసి ఉండాల్సింది : ఫరియా అబ్దుల్లా..!

Published on Apr 29, 2026 12:02 AM IST

‘జాతి రత్నాలు’ సినిమాతో చిట్టి గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది అందాల భామ ఫరియా అబ్దుల్లా. ఇక ఆ తర్వాత తనదైన స్టయిల్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. అయితే, తాజాగా తన కెరీర్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆమె పంచుకుంది. ‘గాయపడ్డ సింహం’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘హను-మాన్’ చిత్రాన్ని తాను రిజెక్ట్ చేశానని ఆమె తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడం తన కెరీర్‌లోనే అతిపెద్ద పొరపాటని ఆమె విచారం వ్యక్తం చేసింది. ఆ సమయంలో తనకు అంత పరిజ్ఞానం లేదని.. అందుకే నో చెప్పానని.. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం.. ‘జాతి రత్నాలు’ హిట్ అవ్వడంతో పాత్ర ప్రాధాన్యతను సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లు ఆమె తెలిపింది.

ఇప్పటికీ తేజ సజ్జా లేదా ప్రశాంత్ వర్మ కనిపిస్తే ఆ సినిమా మిస్ చేసుకున్నాననే బాధ మనసులో మెదులుతూనే ఉంటుందని ఫరియా తెలిపింది. ఫరియా వదులుకున్న ఆ పాత్రను అమృత అయ్యర్ పోషించగా, సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా నటించిన ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో ఆమె మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు