
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ విడుదలకు సిద్ధమైంది. నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఆయన కెరీర్లో ‘కాంచన’, ‘ముని’ సినిమాలు గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పుకోవచ్చు.
నిజానికి మొదట్నుంచీ ఈ సినిమా పేరును ‘కాంచన 2’గానే చలామణి చేస్తూ వచ్చారు. అయితే తాజాగా విడుదల చేసిన తెలుగు ట్రైలర్, ప్రోమోల్లో సినిమా పేరును ‘గంగ(ముని 3)’ అంటూ పేర్కొన్నారు. ట్రైలర్ కాంచన సినిమాను గుర్తు తెచ్చేదిగా బాగుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళంలో ‘కాంచన 2’గానే ఈ సినిమా విడుదలౌతున్నా, తెలుగులో గంగ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే తమిళ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే తెలుగు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తాప్సీ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెల్లంకొండ్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు.
గంగ(ముని 3) ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

