ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్

ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్

Published on Apr 29, 2026 4:00 PM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశిఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉగాది కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఓటిటిలోకి వచ్చిన తర్వాత మాత్రం ఊహించని రెస్పాన్స్ ని ఉస్తాద్ భగత్ సింగ్ నమోదు చేయడం విశేషం.

విడుదల అయ్యిన మొదటి కొన్ని రోజులకే గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ అయ్యిన ఈ సినిమా ఇప్పుడు రెండు వారాల స్ట్రీమింగ్ లో షాకింగ్ నంబర్స్ సెట్ చేసి 2026లో నెంబర్ 1 సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ రెండు వారాల్లో ఈ సినిమా 4.4 మిలియన్ వ్యూస్ ని రాబట్టి 10.9 మిలియన్ స్ట్రీమింగ్ గంటల వ్యవధిని క్లాక్ చేసి రికార్డు రెస్పాన్స్ ఇందులో కొల్లగొట్టింది.

ఇది అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ లో వచ్చిన ఓజి సినిమా లైఫ్ టైం రెస్పాన్స్ కి దగ్గర దగ్గర రెస్పాన్స్ అని చెప్పాలి. దానిని కేవలం ఉస్తాద్ రెండు వారాల్లోనే కొల్లగొట్టాడు. మరి ఈ సినిమా థియేటర్స్ లో మిస్ ఫైర్ అయ్యినా ఓటిటిలో మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాల్సిందే.

తాజా వార్తలు