
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడమే కాకుండా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంటోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా విజయంతంగా రన్ అవుతోంది. కానీ తమిళనాట మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకి ఇబ్బందులెదురయ్యాయి.
తమిళనాడులోని కాంచీ పురంలో ఈ సినిమాని మొదటి రోజే షో జరగనీకుండా ఆపేశారు. ఏపి గవర్నమెంట్, ఏపి పోలీసులు కలిసి శేషాచల అడవుల్లో చేసిన దారుణానికి ప్రతీకగా, ఒక తమిళ గ్రూప్ వారు కాంచీపురం లోని థియేటర్ దగ్గరికి వచ్చి జరుగుతున్న షోని నిలిపివేయడమే కాకుండా థియేటర్ ఓనర్ ని కూడా షో వేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చారు. అలాగే థియేటర్ ని డామేజ్ చెయ్యడమే కాకుండా బయట ఉన్న ఫ్లెక్సీ లను, బ్యానర్స్ ని ధ్వంసం చేసారు. దాంతో ఆ థియేటర్ వారు ఆ సినిమాని నిలిపివేశారు. ప్రస్తుతానికి మళ్ళీ ఎప్పుడు అక్కడ షో వేస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు.

