సూర్య ‘మాస్’ వాయిదా వెనుక కారణం ఇదేనా.?

సూర్య ‘మాస్’ వాయిదా వెనుక కారణం ఇదేనా.?

Published on Apr 13, 2015 7:41 PM IST

mass

తమిళ స్టార్ సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్’. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈ చిత్ర టీం ఈ సినిమాని మే 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. కానీ తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మాస్ సినిమా వాయిదా పడింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాని మే 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

అసలు ఈ సినిమా సడన్ గా వాయిదా పడటానికి గల కారణం కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ అని అంటున్నారు. ఉత్తమ విలన్ కి సోలో రిలీజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం అంత ఒప్పుకునే సినిమాని మే 15కి వాయిదా వేసారని సమాచారం. యాక్షన్ & సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, ప్రణిత హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు