
తెలుగు మరియు తమిళ ఫుల్ క్రేజ్, హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో హీరోయిన్ సమంత. సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘S/O సత్యమూర్తి’ గత గురువారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే అందరినీ ఆశ్చర్య పరుస్తూ సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. అంతే కాకుండా ఈ సినిమాతో సమంత ఓ సెన్సేషనల్ రికార్డ్ ని సృష్టించింది.
ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న టాప్ 3 లో సమంత ఒకరు. ఇప్పటి వరకూ సమంత నటించిన 5 సినిమాలు యుఎస్ బాక్స్ ఆఫీసు వద్ద డాలర్స్ వర్షం కురిపించి 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసాయి. తాజాగా మొదటి మూడు రోజుల్లోనే ‘S/O సత్యమూర్తి’ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. దాంతో సమంత కెరీర్లో యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన సినిమాల సంఖ్య అరడజనుకు చేరింది. సమంత హీరోయిన్ గా నటించిన ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ మరియు ‘S/O సత్యమూర్తి’ సినిమాలు 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసాయి.
ఇలా ఒకే హీరోయిన్ నటించిన అరడజను సినిమాలు యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయడం చాలా అరుదైన విషయం. చెప్పాలంటే ఇప్పటి హీరోయిన్స్ కి ఇలాంటి రికార్డ్ ని బ్రేక్ చెయ్యడం పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ కత్తి సినిమా కూడా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.

