తుదిశ్వాస విడిచిన కార్తీ హీరోయిన్

తుదిశ్వాస విడిచిన కార్తీ హీరోయిన్

Published on Apr 14, 2015 10:00 PM IST

Haanii-Shivraj-Anjani
కార్తి – హన్సికల కలయికలో వచ్చిన ‘బిర్యాని’ సినిమాలో నటించిన హానీ శివరాజ్ అంజని ఏప్రిల్ 13న కన్నుమూసింది. ఈ భామ కాన్సర్ తో చాలా రోజులుగా బాధపడుతూ 29 వ ఏట తుదిశ్వాస విడిచింది.

తమిళ మరియు మళయాళ చిత్రాలలో పాపులర్ అయిన హానీ శివరాజ్ కధ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో సౌత్ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యింది. బిర్యాని సినిమాను తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధించారు. సినిమా ప్రముఖులు ఉదయం నుండి సోషల్ మీడియా లో నివాళిని అర్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు