ఎపిక్ టీజర్ టాక్ : లండన్ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే ప్రేమకథను పట్టుకొస్తున్న ఆనంద్-వైష్ణవి జంట..!

ఎపిక్ టీజర్ టాక్ : లండన్ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే ప్రేమకథను పట్టుకొస్తున్న ఆనంద్-వైష్ణవి జంట..!

Published on Apr 29, 2026 6:07 PM IST

ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎపిక్’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘బేబీ’ చిత్రం తర్వాత మరోసారి ఈ హిట్ పెయిర్ వెండితెరపై రొమాన్స్ చేయనుండటంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తుండగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ప్యూర్ రొమాంటిక్ వైబ్స్‌తో ఆకట్టుకుంటుంది.

లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య వచ్చే సీన్స్ యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ చాలా రిచ్‌గా మరియు కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. టీజర్‌లో ఆనంద్ దేవరకొండ లుక్ చాలా క్లాసీగా ఉండగా, వైష్ణవి తన నటనతో మరోసారి ఆకట్టుకోబోతున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్రధాన బలం కానుంది. సీనియర్ నటుడు శివాజీ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడం టీజర్‌కు కొత్త ఎనర్జీని ఇచ్చింది.

దర్శకుడు ఆదిత్య హాసన్ ఒక అందమైన మరియు ఎమోషనల్ ప్రేమకథను మన ముందుకు తీసుకువస్తున్నట్లు స్పష్టమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్‌లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఇప్పటికే విడుదలైన సాంగ్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా ఎపిక్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు