
బాలీవుడ్ ‘బేబీ’ సినిమా ఘన విజయం తరువాత తాప్సీ తమిళ, హిందీ చిత్రాలలో వరుసపెట్టి పలు అవకాశాలు వచ్చాయి. దీని వలన చెన్నై, ముంబాయి లకు షటిల్ చేస్తూ వస్తుంది.
ఇటీవలే ఈ భామ తనకు తానే BMW ని కొనుక్కుని గిఫ్ట్ ఇచ్చుకుంది. ఈ ఫోటోని స్వయంగా తానే అప్ లోడ్ చేసింది. ‘బేబీ’ ఘన విజయం ఈ సంతోషానికి కారణమైవుంటుందని అంచనా.
తాప్సీ నటించిన కాంచన 2 ఈ వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ లో తాప్సీ ముఖ్య భూమికను పోషించింది.

