మహేష్ సినిమాకు జగపతి స్టైలిష్ లుక్..!

మహేష్ సినిమాకు జగపతి స్టైలిష్ లుక్..!

Published on Apr 16, 2015 1:04 PM IST

jagapathi-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయమే ఉన్నందున కనీసం ఫస్ట్‌లుక్, టీజర్ లాంటివైనా ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అన్న ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. అలాంటి అభిమానులను సినిమాలో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు కాస్త సేద తీర్చే ప్రయత్నం చేశారు.

మహేష్ సినిమాలో తన లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాన్ని తన సోషల్ సైట్‌లో పోస్ట్ చేస్తూ, తన లుక్‌ను విడుదల చేశారు జగపతి బాబు. తన రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్న జగ్గు ఈ సినిమాలోనూ ఏమాత్రం తగ్గరన్నది లుక్ చూస్తే అర్థమైపోతోంది. ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 17న సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు