ఇటివలే ‘లయన్’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న అందాల భామ త్రిష మరొక పెద్ద చిత్రం లో అవకాశం సంపాదించింది. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ నటిస్తున్న ఒక యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ అవకాశం చేజిక్కించుకుంది.
ఇంకా ఈ విషయం ఖరారు కావాల్సివున్నప్పటికీ. నిర్మాతలకి త్రిష ఓకే చెప్పిందని వినికిడి. ఈ చిత్రం జేమ్స్ బాండ్ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోనుంది. కమల్ సహాయ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని కమల్ నిర్మిస్తారు. షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన విడుదల కావాల్సివుంది. ఈ చిత్రం పై మరింత సమాచారం కోసం 123తెలుగు చూస్తూ వుండండి.