
ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వరుసగా స్టార్ హీరోస్ సరసన క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాకి రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నా కానీ తన డేట్స్ అడ్జస్ట్ కాకాపోవడం వలన ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. దీనివల్ల రకుల్ కాస్త బాధ పడింది.
కానీ తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ రాకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువభాగం మహేష్ బాబు సినిమా చేస్తుందని అంటున్నారు. రకుల్ ప్రీత్ వరుసగా ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’, ‘శిమ్లా మిర్చ్’ సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ కి కాస్త ఫ్రీ సమయం దొరికింది. దాంతో మహేష్ బాబు సినిమాకి సమయం కేటాయించిందని సమాచారం. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్, ఎన్.టి.అర్ సినిమాల షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఆ ఆతర్వాత మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ లో జాయిన్ అవుతుంది.

