టాలీవుడ్ డిసిప్లైన్ ఉన్న ఇండస్ట్రీ అంటున్న మహేష్ భామ

టాలీవుడ్ డిసిప్లైన్ ఉన్న ఇండస్ట్రీ అంటున్న మహేష్ భామ

Published on Apr 20, 2015 2:14 PM IST

kriti-sanan
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పొడుగుకాళ్ల ఢిల్లీ సుందరి కృతి సనన్. ఈ ఢిల్లీ బ్యూటీ టాలీవుడ్ లో చేస్తున్న సెకండ్ సినిమా ‘దోచేయ్’. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 24న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ భామ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెగ పొగిడేస్తోంది.

కృతి సనన్ మాట్లాడుతూ ‘ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో క్రమశిక్షణ ఉన్న ఇండస్ట్రీ. నేను పనిచేసిన రెండు ప్రొడక్షన్ టీమ్స్ నన్ను చాలా బాగా ట్రీట్ చేసారు. నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన తెలుగులో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నానని’ తెలిపింది. నాగ చైతన్యతో చేసిన ఈ దోచేయ్ సినిమా తనకి కమర్షియల్ గా బ్రేక్ ఇస్తుందని కృతి సనన్ భావిస్తోంది. ప్రస్తుతం కృతి సనన్ హిందీలో షారుఖ్ ఖాన్ సరసన ‘దిల్ వాలే’ సినిమాలో నటిస్తోంది.

తాజా వార్తలు