మే1 న విడుదల కాబోతున్న సినిమాల్లో ‘గాయపడ్డ సింహం’ కూడా ఒకటి. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నాడు. యంగ్ హీరో శ్రీవిష్ణు క్యామియో పాత్రలో తళుక్కున మెరవబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఆ సీక్వెల్‌లో శ్రీవిష్ణు హీరోగా నటిస్తాడని.. అందుకే ‘గాయపడ్డ సింహం’లో అతడి పాత్రని రంగంలోకి దించినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది.
కాగా ‘గాయపడ్డ సింహం’ క్లైమాక్స్ లో సీక్వెల్ గురించిన లీడ్ ఉండబోతోందని సమాచారం. అదే సమయంలో సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌కు ‘పోరాట సింహం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ ని ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేయించేశారు. అన్నీ అనుకున్నట్టు వర్కవుట్ అయితే ఈ సీక్వెల్‌ని త్వరలోనే రంగంలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ తిరిగే కథ కావడంతో ట్రంప్ ని ఈ సినిమా కోసం ట్రంప్ కార్డ్‌లా వాడేస్తున్నారు. ప్రమోషన్లలోనూ ట్రంప్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పలు హిట్ చిత్రాలకు సంబంధించిన రిఫరెన్సులు కూడా ఉన్నాయి. బొమ్మరిల్లు, పోకిరి, సలార్, కేజీఎఫ్ సినిమాల్ని గుర్తు చేసేలా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేశారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు.


