విడుదలకు సిద్ధమౌతున్న ‘తస్కర’

విడుదలకు సిద్ధమౌతున్న ‘తస్కర’

Published on Apr 24, 2015 1:21 AM IST

taskar
లిబ్రా మీడియా పతాకంపై మహ్మద్ అన్సారీ నిర్మిస్తోన్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘తస్కర’. హాలీవుడ్ స్టైల్ మేకింగ్ నియో నాయిర్ స్టైల్లో దర్శకుడు చంద్రశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఈ స్టైల్లో రూపొందిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘తస్కర’. బ్యాంకులకే డబ్బులిచ్చే సెంట్రల్ బ్యాంకును దోచేసిన వ్యక్తి కథే ఈ సినిమా. ఈ సినిమా కథా విస్తరణ కోసం డైరెక్షన్ టీమ్ సుమారు సంవత్సరం పాటు రీసెర్చ్ చేయడం విశేషం.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ దగ్గర పనిచేసిన రోహిత్ కుమార్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. రాజేంద్రనాథ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. హిమాంశు అందించిన గ్రాఫిక్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు. కిరీటి, నీసా, శ్రీనివాస్, గోవింద్, సంపత్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

ఇక సంక్రాంతి రోజున విడుదల చేసిన ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖ బ్రాండ్ పీటర్ ఇంగ్లాండ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు నిర్మాత తెలిపారు.

తాజా వార్తలు