
సందీప్ కిషన్ హీరోగా ఓ భారీ సినిమా రూపొందనుందన్న వార్త ఈ మధ్య హల్‌చల్ చేసింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఓ భారీ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వాటిల్లో నిజం లేదని సందీప్ కిషన్ స్పష్టం చేశారు.
“నేను వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి కేవలం తప్పుడు వార్తలు మాత్రమే. అయితే అటువంటి ఆఫర్ వస్తే మాత్రం చాలా సంతోషం” అంటూ తన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. సందీప్ కిషన్ తాజాగా నటించిన ‘టైగర్’ సినిమాను మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
There is no truth to the rumours about me doing a Film With Vinayak Garu & Samantha,as much as I would love to its not true..just clarifying
— Sundeep Kishan (@sundeepkishan) April 25, 2015

