క్రేజీ కాంబినేషన్ లో నాగ చైతన్య నెక్స్ట్ మూవీ.!

క్రేజీ కాంబినేషన్ లో నాగ చైతన్య నెక్స్ట్ మూవీ.!

Published on Apr 26, 2015 6:09 PM IST

Naga-Chaitanyas-first-look
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ‘దోచేయ్’ సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఈ సినిమాతో నాగ చైతన్య తన కెరీర్లో మరో హిట్ అందుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు. నాగ చైతన్య తన్ తదుపరి సినిమాని ‘కార్తికేయ’ సినిమాతో పరిచయమైన చందు మొండేటి తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో చందు సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఈ చిత్ర టీం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందే నాగ చైతన్య ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారు, సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ‘ఏ మాయ చేసావే’. ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కలిసి ఓ సినిమా చేసే పనిలో ఉన్నాడు. ఈ సూపర్ హిట్ కామినేషణ్ లో అనుకుంటున్న సినిమాని టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలో మొదలవుతుందని సమాచారం. మరి నాగ చైతన్య – గౌతమ్ మీనన్ కలిసి ఏ మాయ చేసావే మేజిక్ ని రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు