‘పండగ చేస్కో’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు..!

‘పండగ చేస్కో’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు..!

Published on Apr 27, 2015 2:58 PM IST

Pandaga-chesko
రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్నాడు హీరో రామ్. ఈ క్రమంలోనే ‘పండగ చేస్కో’, ‘శివం’, ‘హరికథ’ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయాడు. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ‘పండగ చేస్కో’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ఆడియో రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి.

థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘పండగ చేస్కో’ ఆడియోను మే 1న విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని హీరో రామ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కన్‌ఫర్మ్ చేశాడు. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా సాటిలైట్ హక్కులు బంపర్ ధరకు అమ్ముడుపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక మే నెల్లోనే సినిమాను కూడా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు