
ఆరడుగుల ఆజానుబాహుడు, టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేయనున్న బాహుబలి, రుద్రమదేవి సినిమాలకు సంబందించిన షూటింగ్ ని ఫినిష్ చేసాడు. అవి ఫినిష్ కావడంతో తన లుక్ ని మార్చి తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ముందుగా తమిళంలో రూపొందుతున్న బెంగుళూరు డేస్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది రానా పెళ్ళికొడుకు అయ్యాడు అన్నారు, దాని గురించి చెప్పడం లేదని ఆలోచిస్తున్నారా..? అక్కడికే వస్తున్నాను..
రానా పెళ్లి కొడుకైంది నిజ జీవితంలో పెళ్లి చేసుకోవడం కోసం కాదు. ఓ సినిమా కోసం మాత్రమే.. కానీ తన కెరీర్లో మొదటి సారిగా పెళ్లి కొడుకు గెటప్ లో పెళ్లి సీన్ చేస్తుండడం వలన తను ఎంతో ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాడు. ‘తమిళ బెంగుళూరు డేస్ రీమేక్ కోసం నా ఫస్ట్ ఫిల్మ్ వెడ్డింగ్’ అని రానా ట్విట్టర్ లో ఫోటో కూడా షేర్ చేసాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. ఆర్య, బాబీ సింహ, శ్రీ దివ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ బెంగుళూరు డేస్ రీమేక్ ని తెలుగులో కూడా త్వరలో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.

