‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ లిస్ట్‌లో మహేష్ ర్యాంక్ ఎంత?

‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ లిస్ట్‌లో మహేష్ ర్యాంక్ ఎంత?

Published on Apr 28, 2015 11:39 AM IST

Mahesh-babu
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో తమ హీరో ర్యాంక్‌ను చూసి అభిమానులు మురిసిపోవడం ప్రతిసారీ జరిగేదే! 2011నుంచి తెలుగు టాప్ హీరో మహేష్ బాబు ఇందులో స్థానం సంపాదిస్తూ ఉండడంతో ఈ లిస్ట్‌పై తెలుగు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక గత సంవత్సరం మహేష్ బాబు ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించడంతో మోస్ట్ డిజైరబుల్ మెన్ అవార్డులపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

తాజాగా 2014 సంవత్సరానికి గానూ మోస్ట్ డిజరైబుల్ మెన్ లిస్ట్‌ను ప్రకటించింది టైమ్స్. ఇందులో గత సంవత్సరం మొదటి ప్లేస్‌లో ఉన్న మహేష్ ఈసారి 6వ స్థానంలో ఉన్నారు. అయితే సౌత్ ఇండియా సెలబ్రిటీల విషయంలో మహేష్ బాబే టాప్‌లో నిలిచారు. ఈసారి మొదటిస్థానాన్ని ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నారు. హృతిక్ రోషన్, ఫవాద్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, షాహిద్ కపూర్‌లు టాప్ 5లో ఉన్నారు. ఇక తెలుగు హీరోలు రానా(17), రామ్ చరణ్ తేజ్‌(30)లు మాత్రమే టాప్ 30లో ఉన్నారు.

తాజా వార్తలు