
కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పింది. ఇప్పుడు ఆ రుద్రమదేవి ఘనతని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి జీవితకథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. ఇటీవలే ఈ సినిమా ఆడియోని మరియి ట్రైలర్స్ ని రిలీజ్ చేసారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న సినిమా కావడం వలన పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకోవడంతో ఇప్పటి వరకూ ఈ చిత్ర టీం పలు రిలీజ్ డేట్స్ ని అనుకున్నా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు చివరి దశకు చేరుకోవడంతో సంమర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా రిలీజ్ కోసం మే 22వ తేదీని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అన్నీ అనుకున్న టైంకి అయిపోతే గుణశేఖర్ ఈ డేట్ కి సినిమాని రిలీజ్ చేసి సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

