అఖిల్ సినిమా ఫారెన్ టూర్ విశేషాలు

అఖిల్ సినిమా ఫారెన్ టూర్ విశేషాలు

Published on Apr 30, 2015 3:48 AM IST

akhil1
అక్కినేని వంశంలో మరో అందగాడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం వి.వి వినాయక్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ముంబాయిలో చిత్రీకరించారు. కాస్త విరామం తరువాత చిత్ర బృందం ఈ నెల 30న స్పెయిన్ టూర్ కి వెళ్ళి అక్కడ అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయనున్నారు.

ఈ ఫారెన్ షెడ్యూల్ తరువాత జూన్ 5నుండి అఖిల్ పై ఇంట్రడక్షన్ సాంగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించనున్నారు. ఈ పాత తరువాత దాదాపు నెలరోజుల పాటూ ఆఫ్రికాలో ఉగాండా ప్రాంతాలలో షూట్ చేయనున్నారు.

సినిమా చిత్రీకరణ విషయంలో నిర్మాత నితిన్ ఎక్కడా రాజీపడకపోవడం ఆసక్తికరం. సమాచారం ప్రకారం ఈ సినిమాను వినాయక చవితిన గానీ దసరాకి గానీ విడుదలచేయనున్నారు.

తాజా వార్తలు