‘బాహుబలి’కి గురువుగా తనికెళ్ళ భరణి.!

‘బాహుబలి’కి గురువుగా తనికెళ్ళ భరణి.!

Published on Apr 30, 2015 4:44 PM IST

baahubali

తెలుగు చలన చిత్ర స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేసే దిశగా టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ దిరెచ్తొర్స్ ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న గ్రాఫికల్ పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, బాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఓ ఆసక్తికర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం..ఈ సినిమాలో ఒక రాజ్యానికి రాజుగా మరియు వారియర్ అయిన బాహుబలి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ బాహుబలికి సకల విద్యలు నేర్పించే గురువుగా తనికెళ్ళ భరణి కనిపించనున్నాడు.

బాహుబలిలో ప్రభాస్ కి యుద్ద విద్యలు, కత్తి యుద్దాలు, యుద్దంలో ప్రదర్శించాల్సిన వ్యూహాలను నేర్పించి ఓ పర్ఫెక్ట్ వారియర్ గా తీర్చిదిద్దే గురువు పాత్రలో తనికెళ్ళ భరణి కనిపిస్తాడు. అలాగే తనికెళ్ళ భరణిపై వచ్చే సీన్స్ ని కేరళలో షూట్ చేసారు. రెండు పార్ట్స్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, విజువల్స్ ఎఫెక్ట్స్ పనులు అస్సలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ‘బాహుబలి ది బిగినింగ్’ అంటూ వచ్చే మొదటి పార్ట్ ని జూలైలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే బాహుబలి ఫస్ట్ పార్ట్ ట్రైలర్ ని మే 31న రిలీజ్ చేయనున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు