ఆగిపోయిన ‘ఉత్తమ విలన్’ మార్నింగ్ షోస్!

ఆగిపోయిన ‘ఉత్తమ విలన్’ మార్నింగ్ షోస్!

Published on May 1, 2015 9:00 AM IST

Uttamavillain

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటి నేడు (మే 1న) విడుదలకు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమాకు సంబంధించి ఎర్లీ షోస్ అన్నీ కాన్సల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడులతో పాటు కర్ణాటకలో కూడా ఈ సినిమా కోసం అభిమానులు సిద్ధమయ్యారు. కాగా చివరి నిమిషంలో షో కాన్సిల్ అయిన విషయం తెలియడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కాగా ఈ సినిమా మధ్యాహ్నం షోలపై కూడా ఇంకా ఓ స్పష్టత రాలేదు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయమై చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు సాయంత్రంకల్లా అన్ని ఇబ్బందులనూ క్లియర్ చేసుకొని ఈ సినిమా విడుదలకు సిద్ధమవనుందని తెలుస్తోంది. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సి. కళ్యాణ్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు