
మంచు లక్ష్మి నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ దొంగాట సినిమా ఈరోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ చిత్రంలో మంచు లక్ష్మి నటన ప్రధాన ఆకర్షణగా నిలిచినట్టు సమాచారం. సినిమా చూసినవారంతా ద్వితీయార్ధంలో వచ్చే ప్రత్యేక గీతం గురించి మాట్లాడుకోవడం విశేషం.
ఈ పాటలో మంచు లక్ష్మితో పాటూ రానా, నాని, నవదీప్, సుశాంత్, నాగార్జున, శింబు, రవితేజ తదితరుల హీరోలు కనిపించారు. తమ అభిమాన హీరోలు కనిపించడంతో ప్రేక్షకులు ఒకింత ఆనందానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో తనకున్న ఫ్రెండ్ షిప్ కారణంగా వీలయిన ఈపాట ఇప్పుడు చిత్రానికి అదనపు కలక్షన్ లను తెచ్చిపెడుతుంది. ఏదిఎమైనా ఒక మంచి జ్ఞాపకాన్ని ఇచ్చిన మంచు లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు.

