మళ్ళీ రిలీజ్ కానున్న చిరు ‘జగదేకవీరుడు’

మళ్ళీ రిలీజ్ కానున్న చిరు ‘జగదేకవీరుడు’

Published on May 12, 2015 7:28 PM IST

jagadeka-verudu-akiloka-son
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – సినీ చరిత్రలో అతిలోక సుందరి అయిన శ్రీదేవి – దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు – భారీ చిత్రాలకు మారుపేరయిన అశ్వనీదత్ కలిసి సినిమా సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు చలన చరిత్రలో కొత్త రికార్డ్స్ కి నాంది పలికింది. ఈ సినిమా మే 9 నాటికికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తున్నాం.

ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ మళ్ళీ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ఈ సినిమాని సౌండ్ అండ్ కలర్ఫుల్ డిజిటల్ క్వాలిటీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. డిజిటల్ మాస్టర్ ప్రింట్ ని రెడీ చెయ్యడానికి అశ్వనీదత్ రంగం సిద్దం చేసుకుంటున్నాడు. త్వరలోనే డిజిటల్ ప్రింట్ వర్క్ మొదలు పెట్టి ఈ ఏడాది లోనే జగదేక వీరుడిని, అతిలోక సుందరిని మన ముందుకు తీసుకు రానున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమా లేక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఇదో పెద్ద శుభవార్త.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు