స్టార్ హీరోల సినిమాలకి, బాగా క్రేజ్ ఉన్న సినిమాలకి సంబందించిన శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ టీవీ చానళ్ళ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కిక్ 2’. మాస్ మహారాజ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కిక్ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాపై భారీ అంచనలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే ఓ బంపర్ ప్రైజ్ కి అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని వరు సుమారు 7.5 కోట్లకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ రేటు పలకడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.
ఈ ఏడాది ఒక హీరోగా, నిర్మాతగా ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మొదటిసారిగా తన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై బయటి హీరోతో చేస్తున్న సినిమా ‘కిక్ 2’. కిక్ కావాలి అంటూ మొదటి పార్ట్ లో ఎంటర్ టైన్ చేసిన రవితేజ ఈ సారి కంఫర్ట్.. కంఫర్ట్ అంటూ నవ్వించడానికి వస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియోని ఇటీవలే ఎన్.టి.ఆర్ చేతులమీదుగా లాంచ్ చేసారు. ఈ సినిమాలో రవితేజ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్.


