సింగీతం గారి ‘సింగ్-గీతం’.. నెక్స్ట్ లెవెల్ అంతే..!

సింగీతం గారి ‘సింగ్-గీతం’.. నెక్స్ట్ లెవెల్ అంతే..!

Published on May 1, 2026 9:58 PM IST

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న సరికొత్త చిత్రానికి ‘సింగ్-గీతం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక నిశ్శబ్ద గ్రామం నేపథ్యంలో సాగే మ్యూజికల్ ఫాంటసీగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.

​ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. నేటి తరం విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. అయాన్, అహల్య బమ్రూ మరియు శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో దాదాపు 12 పాటలు ఉండబోతున్నట్లు సమాచారం.

​సింగీతం శ్రీనివాసరావు మార్కు విభిన్న కథాంశంతో, నాగ్ అశ్విన్ మేకింగ్ విలువలతో రాబోతున్న ఈ ‘సింగ్-గీతం’ జూన్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఫాంటసీ మరియు కామెడీ అంశాల కలయికతో రూపొందిన ఈ టీజర్, సింగీతం గారి నుంచి మరో ప్రయోగాత్మక దృశ్య కావ్యం రాబోతుందని భరోసా ఇస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు