
యూరప్ లో అందమైన లోకేషన్ల మధ్య రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా డ్యుయెట్ లను చిత్రీకరిస్తున్నాడు శ్రీనువైట్ల. ఈ పాటల షూటింగ్ దాదాపు 10రోజులు సాగుతుంది. ఈ రెండు పాటలకు కొరియోగ్రాఫర్ శోభి నృత్యాన్ని సమకూరుస్తున్నాడు. థమన్ సంగీతదర్శకుడు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ గా కనిపించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ 3నుండి హైదరాబాద్ లో ప్రారంభంకానుంది. ప్రధాన పాత్రల నడుమ ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ వుంటుంది గాబట్టి ఈ షెడ్యూల్ చాలా కీలకం కానుంది. ఈ సినిమాకు రెండు మూడు టైటిల్స్ లను పరిశీలిస్తున్నారు. అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనువైట్లతో గోపీమోహన్, కోనా వెంకట్ కలిసి పనిచేస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రం విడుదలకానుంది.

