‘సింగం 123’ విడుదల తేదీ ఖరారు

‘సింగం 123’ విడుదల తేదీ ఖరారు

Published on May 25, 2015 3:54 PM IST

singham123
‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అంటూ ‘సింగం 123′ టీజర్, ట్రైలర్ డైలాగులతోనే కేక పుట్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్, త్వరలోనే థియేటర్లలో సినిమా ద్వారా రచ్చ చేయనున్నారు. ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ సినిమాకు తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయింది.

‘సింగం 123’ సినిమాను మొదట వేసవి కానుకగా మే 15నే విడుదల చేయాలనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకూ కొత్త విడుదల తేదీపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. తాజాగా జూన్ 5వ తేదీని కొత్త విడుదల తేదీగా ఖరారు చేశారు. సంపూర్ణేష్ బాబు పేరడీ సన్నివేశాలు, డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు