తెలుగు స్టార్ రైటర్ హిందీ సినిమాకు భారీ క్రేజ్!

తెలుగు స్టార్ రైటర్ హిందీ సినిమాకు భారీ క్రేజ్!

Published on May 30, 2015 10:55 AM IST

Vijendra-prasad
ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమాల్లో అద్భుతమైన కథాబలం ఉంటుంది. బలమైన కథలను తన మార్క్ స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో మరచిపోలేని సినిమాలను తెరకెక్కించారు రాజమౌళి. రాజమౌళి సినిమాలకు మూలకథను అందించేది ఆయన తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ ఏడాది ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కుతోన్న ‘భజరంగీ భైజాన్’ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించడం విశేషంగా కనిపిస్తోంది.

‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కబీర్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ‘భజరంగీ భైజాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రమాదవశాత్తు ఇండియాలో చిక్కుకుపోయిన ఓ పాకిస్థాన్‌కు చెందిన పాపను తన వాళ్ళకు అప్పగించే హీరో కథే ఈ సినిమాగా తెలుస్తోంది. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించడంతో పాటు దర్శకుడితో కలిసి స్క్రీన్‌ప్లే కూడా రాశారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రంజాన్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదలకు రెండు నెలల పైనే సమయం ఉన్నా ఇప్పట్నుంచే ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు