
ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన సినిమా ‘చెంబు చినసత్యం’. ఎల్.ఐ.సీ. ఏజెంట్ ఉపశీర్షిక. సుమన్ శెట్టి, శర్రశ్చంద్ర, ప్రమోదిని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నామాల రవీంద్రసూరి దర్శకత్వం వహించారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఈ ఉదయం ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ముఖ్య అతిధిగా హాజరై ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. ఇక ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొని సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు తోట రమణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చారు.

