పాతబస్తీలో చెర్రీ సినిమా షూటింగ్!

పాతబస్తీలో చెర్రీ సినిమా షూటింగ్!

Published on Jun 3, 2015 10:24 AM IST

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీనువైట్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు ఈ సినిమాకు రచయితలుగా పనిచేస్తున్నారు. డీవీవీ దానయ్య చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మధ్యే ఇటలీ, స్పెయిన్‌లలోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్య రెండు పాటలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా హైద్రాబాద్‌లో ఈరోజే కొత్త షెడ్యూల్ మొదలైంది.

హైద్రాబాద్‌లోని పాతబస్తీలో రామ్ చరణ్‌ నటిస్తున్న కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ హైద్రాబాద్ షెడ్యూల్‍లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు