హర్రర్ కామెడీతో భయపెట్టనున్న త్రిష!

హర్రర్ కామెడీతో భయపెట్టనున్న త్రిష!

Published on Jun 16, 2015 5:53 PM IST

Trisha
తన అందంతో, అభినయంతో తెలుగుతో పాటు తమిళ, హిందీ అభిమానులను సైతం కట్టిపడేసిన హీరోయిన్ త్రిష. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌ అయినా ఐదారేళ్ళకు మించి హీరోయిన్‌గా కొనసాగే అవకాశంలేనంత పోటీ ఉన్న నేపథ్యంలోనూ పదమూడేళ్ళు హీరోయిన్‌గా నిలబడి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించించి త్రిష. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

ఇప్పటికే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తూంగవనం (చీకటి రాజ్యం)లో హీరోయిన్‌గా నటిస్తున్న త్రిష, తాజాగా సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరన్‌మనై 2’ షూటింగ్‌లో ఈరోజే జాయినయింది. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హన్సిక మరో హీరోయిన్‌గా నటిస్తోంది. గత సంవత్సరం హన్సిక లీడ్ రోల్‌లో నటించిన హర్రర్ కామెడీ ‘అరన్‌మనై’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరన్‌మనై’ సినిమా తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో విడుదలైంది.

తాజా వార్తలు