తన మొదటి సినిమా తోనే సత్తా చాటిన దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తన అవైటెడ్ చిత్రం శ్రీనివాస మంగాపురం లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తాను దాదాపు పూర్తి చేస్తుండగా ఈ చిత్రం తర్వాత చేయనున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “మంగళవారం” పై లేటెస్ట్ ఇన్ఫో తెలుస్తుంది. శ్రీనివాస మంగాపురం తర్వాత వెంటనే ఈ సినిమాని తాను స్టార్ట్ చేయనున్నారట.
ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసేసారు. ఇక జస్ట్ స్టార్ట్ చేయడమే బాకీ. ఈ సినిమా షూట్ ని దాదాపు ఈ ఏడాది ఆగస్ట్ నుంచే స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. సో మంగళవారం పార్ట్ 2 అప్పటి నుంచి మొదలు కానుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కొనసాగనున్నారు. అలాగే శ్రీనివాస మంగాపురం లో యువ జంట జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంటగా నటిస్తుండగా త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయనున్నారు.


