
సినిమా సినిమాకి ఏదో ఒక కొత్తదనంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మిర్చి ఫేం కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్ లో ఒక స్టార్ హీరో సినిమా వస్తోంది అంటే ఆ సినిమా పై భారీ అంచనాలతో పాటు బిజినెస్ విషయంలో కూడా గట్టి పోటీ ఉంటుంది. ఇప్పుడు శ్రీమంతుడు విషయంలోనూ అదే జరుగుతోంది.
ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో అన్ని ఛానల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫైనల్ గా ఓ భారీ మొత్తానికి జీ తెలుగు వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్ ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. సినిమాకి ముందే ఈ రేంజ్ కి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడంతో ఈ చిత్ర నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చేయనున్నారు.
మహేష్ బాబు సరసన మొదటి సారి హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

