ముంబాయిలో బిజీబిజీగా రాజమౌళి, కీరవాణి

ముంబాయిలో బిజీబిజీగా రాజమౌళి, కీరవాణి

Published on Jun 21, 2015 12:55 AM IST

rajamoulii
విడుదలతేది దగ్గర పడుతున్న కొద్దీ బాహుబలి చిత్ర బృందం నిర్మాణాంతర పనులలో బిజీగా మారుతుంది. ప్రస్తుతం ముంబాయిలో ప్రచార కార్యక్రమాలలో స్టార్ క్యాస్ట్ నిమగ్నమై వుండగా, సెంథిల్ కుమార్ వి.ఎఫ్.ఎక్స్ కి తన కెమెరా పనితనం జతచేసి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.

ఇదే సమయంలో ముంబై రాజ్ కమల్ స్టూడియోస్ లో కీరవాణి రీరికార్డింగ్ పనులలో మునిగిపోయాడు. రాజమౌళి వీటిని పర్యవేక్షిస్తున్నాడు. సెన్సార్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతుంది. జులై 10న ఈ సినిమా విడుదలకానుంది.

తాజా వార్తలు