‘టైగర్’ ప్రమోషన్స్ లో బిజీ బిజీ యంగ్ హీరో

‘టైగర్’ ప్రమోషన్స్ లో బిజీ బిజీ యంగ్ హీరో

Published on Jun 21, 2015 12:56 PM IST

sundeep-kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్’. ఈ సినిమా జూన్ 26న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సందీప్ కిషన్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించిన ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్లో చాలా కీలకం కానుంది. అందుకే ఈ సినిమా విషయంలో సందీప్ చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా భారీగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. సందీప్ కిషన్ ఈ సినిమా దాదాపు అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సినిమాని ప్రమోట్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే సోషల్ మీడియాలో అందరితో ఇంటరాక్ట్ అయిన సందీప్ కిషన్ ప్రస్తుతం సిటీలోని మల్టీ ప్లెక్స్ లని విజిట్ చేస్తూ, అక్కడ ప్రేక్షకులందరితో కలిసి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుండగా సీరత్ కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. కాశీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ద్వారా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని ఎన్వీ ప్రసాద్ – ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు