‘బాహుబలి’లో టిటిడి బృందం వారి నాదస్వరం ఎఫెక్ట్.!

‘బాహుబలి’లో టిటిడి బృందం వారి నాదస్వరం ఎఫెక్ట్.!

Published on Jun 21, 2015 6:22 PM IST

ttd-baahubali

టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసేలా టాలీవుడ్ జక్కన్న రెండున్నరేళ్ళ పాటు కష్టపడి చేసిన సినిమా ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ అయిన ‘బాహుబలి – ది బిగెనింగ్’ జూలై 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి.

ముందుగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రీ రికార్డింగ్ పనులను చివరి దశకు తీసుకు వచ్చేసాడు. అంతే కాకుండా ఈ చిత్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో బాగంగా కీరవాణి టిటిడి కి చెందిన నాదస్వర బృందంతో కలిసి రికార్డింగ్ చేసారు. సుమారు 15మందికి పైగా ఉన్న నాదస్వర బృందంతో హైదరాబాద్ లో రికార్డింగ్ పూర్తి చేసారు. ఇది కాకుండా మిగిలిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 24న తమిళంలో, జూన్ 27న మలయాళంలో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

తాజా వార్తలు