‘సింగం’ సిరీస్‌లో మూడో భాగమే హైలైట్..!

‘సింగం’ సిరీస్‌లో మూడో భాగమే హైలైట్..!

Published on Jun 22, 2015 7:40 PM IST

singham-2
‘గజిని’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్యను తెలుగులో స్టార్‌ను చేసిన సినిమాలు.. ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా ‘సింగం 3’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దర్శకుడు హరి ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక సింగం 3 స్క్రిప్ట్ పూర్తి చేసిన సందర్భంగా.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ‘సింగం’ సిరీస్‌లో ఈ పార్ట్ అన్నింటికంటే పవర్‌ఫుల్‌గా ఉండనుందని హరి తెలిపారు.

‘సింగం’ సిరీస్‌లోని రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించిన అనుష్క, ఈ మూడో సినిమాలోనూ కొనసాగనున్నారు. శృతీ హాసన్ మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇక ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లొకేషన్ల ఎంపికతో పాటు పలు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సూర్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ’24’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు