
తమిళనాడులో సూపర్ స్టార్డం ఉన్న హీరో ఇలయదలపథి విజయ్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘పులి’. అభిమానులు ఎంతగానో ఇందూరు చూస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజర్ ని విజయ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా ఇండియన్ సినిమాలోనే అరుదైన రికార్డ్ ని నెలకొల్పింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఇండియన్ సినిమాలో అత్యధికంగా పోస్టర్స్ డౌన్ లోడ్ చేసుకున్న సినిమాగా రికార్డ్ సాధించింది. ఇప్పటి వరకూ టాప్ ప్లేస్ లో అమీర్ ఖాన్ పికె ఉండేది, ఇప్పుడు పులి ఆ పికె రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.
అంతే కాకుండా ఇంకా రెండు రోజులు కూడా పూర్తి కాకుండానే పులి ఫస్ట్ టీజర్ యు ట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చింబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇది కాకుండా విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

