
జేమ్స్ హర్నర్ – తన టాలెంట్ కి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రియంగా భావించే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్. వరల్డ్స్ బెస్ట్ ఆన్ స్క్రీన్ లవ్ స్టొరీ అనిపించుకున్న టైటానిక్ మరియు గ్రాఫికల్ వండర్ అయిన అవతార్ సినిమాలకు మ్యూజిక్ అందించింది జేమ్స్ హర్నర్. ఈ రెండు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన జేమ్స్ హర్నర్ ఈ రోజు యుఎస్ లోని శాంత బార్బరాలో జరిగిన ప్లెయిన్ క్రాష్ లో చనిపోయారు.
61 ఏళ్ళ వయసులో జేమ్స్ హర్నర్ తన తుదిశ్వాసని విడిచారు. హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కమరూన్ తో కలిసి పనిచేసిన జేమ్స్ హర్నర్ టైటానిక్ సినిమాకి గాను రెండు అకాడమీ అవార్డ్స్ అందుకున్నాడు. అలాగే జేమ్స్ కమరూన్ తీసిన ఎలియన్స్, అవతార్ సినిమాల సౌండ్ ట్రాక్ సేల్స్ వరల్డ్ లో రికార్డ్స్ సృష్టించాయి. జేమ్స్ హర్నర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న సౌత్ పా, వోల్ఫ్ టోటెమ్, ది 33ల సౌండ్ ట్రాక్స్ డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అంతే కాకుండా జేమ్స్ కమరూన్ అవతార్ సీక్వెల్ కి త్వరలోనే జేమ్స్ హర్నర్ తన వర్క్ మొదలు పెట్టనున్నాడు కానీ మధ్యలో ఇలా జరిగింది. ఎంతో మంది మ్యూజిక్ లవర్స్ మరియు హాలీవుడ్ ని ఈ వార్త శోఖ సముద్రంలో ముంచింది.

