బాహుబలి కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్

బాహుబలి కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్

Published on Jun 23, 2015 11:35 PM IST

Baahubali
ప్రస్తుతం సినిమా రంగంలో ఎవరినోట విన్నా బాహుబలి మాట సర్వసాధారణంగా వినిపిస్తుంది. . టాలీవుడ్ అనే కాదు భారతదేశమంతా బాహుబలి పేరు మారుమోగిపోతుంది. ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రచారం చెయ్యడంకోసం సినీ ప్రముఖులంతా ముందుకు రావడం విశేషం. హిందీ పత్రికా విభాగం కూడా ఈ చిత్ర విశేషాలను ముమ్మరంగా కవర్ చేస్తుంది. 9జులై న ఈ సినిమా ప్రిమియర్ షోని ప్రదర్శించనున్నారు. రాజమౌళి దర్శకుడు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ముఖ్యపాత్రధారులు. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత

తాజా వార్తలు