2 సినిమాలతో బిజీ కానున్న నాగార్జున

2 సినిమాలతో బిజీ కానున్న నాగార్జున

Published on Jun 24, 2015 12:11 PM IST

nagarjuna
సీనియర్ స్టార్ హీరో అయిన కింగ్ నాగార్జున ప్రస్తుతం రెండ సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేస్తున్న నాగార్జున త్వరలోనే సినిమా షూటింగ్ లతో బిజీ కానున్నాడు. నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేస్తుంటే, వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో కార్తీతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనాకి సంబందించిన టాకీ పార్ట్ చాలా వరకూ పూర్తయ్యింది. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ జూన్ 26 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. జూలై మొదటి వారం వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది.

సోగ్గాడే చిన్ని నాయనా షెడ్యూల్ పూర్తి కాగానే జూలై 10 తర్వాత నుంచి నాగార్జున వంశీ పైడి పల్లి సినిమాకి షిఫ్ట్ అవుతాడు. ఈ సినిమాలో నాగార్జున ఇది వరకూ కనిపించని ఓ డిఫరెంట్ లుక్ మరియు ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చింది. ఉయ్యాలా జంపాలా ఫేం రామ్ మోహన్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని నిర్మిస్తుంటే, పివిపి సినిమాస్ వారు నాగార్జున – కార్తీ – వంశీ పైడిపల్లి సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు