
సూపర్ స్టార్ మహేష్ బాబు – అందాల భామ శృతి హాసన్ గాజుల దుకాణాలు ఉన్న స్ట్రీట్ లో ఏం చేస్తున్నారు..? అక్కడ ఎందుకు చక్కర్లు కొడుతున్నారు.? అనే విషయం తెలియాలంటే మీరు శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే. మహేష్ బాబు, శృతి హాసన్ మరియు ఇతర తారాగణం పై వచ్చే కొన్ని సీన్స్ ని తీయడం కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో గాజుల దుకాణాలు ఉన్న ఓ స్ట్రీట్ సెట్ వేసారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం అక్కడే షూట్ చేస్తున్నారు.
ఈ నెల 27వ తేదీకల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైన షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఫుల్ స్వింగ్ లో జరుగుతాయి. జూలై 18న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి మహేష్ బర్త్ డే కానుకగా ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మహేష్ ఈ సినిమా ధనికుడు మరియు అబ్రాడ్ నుంచి వచ్చిన కుర్రాడిగా కనిపించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

