‘విద్యాబాలన్’లో హైలైట్ కానున్న కామెడీ

‘విద్యాబాలన్’లో హైలైట్ కానున్న కామెడీ

Published on Jun 24, 2015 7:54 PM IST

wher-is-vidyabalan
‘సస్పెన్స్ కి కామెడీ తోడైతే.. ఆ ఫార్ములా సూపర్ హిట్’ అనే డైలాగ్ కార్తీకేయ సినిమాలో నిఖిల్ చెప్పిన డైలాగ్.. కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా.. ఒక ఇక విషయంలోకి వెళితే.. ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ’ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రాఘ ఈ సారి సస్పెన్స్ కి కామెడీని మిక్స్ చేసి చేసిన సినిమానే ఇది. బస్ స్టాప్, రొమాన్స్ సినిమాలతో ఆకట్టుకున్న ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా జ్యోతిసేతి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

ఈ సినిమా చూసిన వారి నుంచి మరియు ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం అందరినీ థ్రిల్ చేసే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటూనే ప్రేక్షకులు కోరుకునే కామెడీ ఉంటుందంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం అందరి కమెడియన్స్ తో ఫన్నీ ఫన్నీ గా సాగుతూ ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని ఎల్.వేణుగోపాల్‌ రెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి కలిసి నిర్మించారు. ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నాడు.

తాజా వార్తలు