తమిళ ‘దృశ్యం’ విడుదల తేదీ ఖరారు!

తమిళ ‘దృశ్యం’ విడుదల తేదీ ఖరారు!

Published on Jun 24, 2015 7:56 PM IST

Papanasam-Movie
మోహల్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా ‘దృశ్యం’. ఇక ఈ సినిమాను అదే పేరుతో విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయగా ఇక్కడా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఇప్పుడు సినిమా ఇచ్చే థ్రిల్‌ను పొందేందుకు తమిళ ప్రేక్షకులు సైతం సిద్ధం కానున్నారు.

‘దృశ్యం’ సినిమాను కమల్ హాసన్ హీరోగా మాతృక దర్శకుడు జీతూయే ‘పాపనాశం’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న విడుదలకు సిద్ధమైంది. కమల్ ‘విశ్వరూపం 2’తో ముడి పెట్టుకొని రిలీజ్‌పై స్పష్టత లేకుండా ఉండిపోయిన ఈ సినిమా, విశ్వరూపం 2 రిలీజ్‌కు మరికొంత సమయం పట్టనుండడంతో పాపనాశనం సినిమాను విడుదలకు సిద్ధం చేసేశారు. తెలుగు, మళయాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ థ్రిల్లర్, తమిళ ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని కమల్ ధీమాగా ఉన్నారు.

తాజా వార్తలు